ఒక సినిమాను తెరకెక్కిస్తే దర్శకనిర్మాతలు తమ పనితనంతో పాటు లాభాలపై కూడా అంచనాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడి అయినా వస్తే చాలని చాలా మంది సినిమాలపై ఆసక్తిని చూపుతారు. కానీ, కొన్ని సినిమాలు నిర్మాతలకి నష్టాలని మిగిలిస్తాయి.
అయితే, రీసెంట్గా ఓ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినా, దాని రిజల్ట్ మాత్రం దారుణంగా నిలిచింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా ఇది నిలిచింది. కన్నడ హీరో ధృవ సర్జా నటించిన రీసెంట్ మూవీ ‘మార్టిన్’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, భారీ క్యాస్టింగ్‌తో రావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. కానీ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమాత్రం లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.
ఇక ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయడంతో, సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా ఇది నెగెటివ్ రెస్పాన్స్‌ను మూటగట్టుకుంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఏదేమైనా ఓ సినిమా కేవలం స్టార్ క్యాస్టింగ్‌పై నమ్మకం పెట్టుకుని భారీ బడ్జెట్‌తో రావడం ఏమాత్రం ఆమోదించతగ్గ విషయం కాదని మార్టిన్ మరోసారి ప్రూవ్ చేసింది.