పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ చివరినాటికి ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని.. క్రిస్మస్ కానుకగా ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నాడట. దీనికోసం మారుతి తీవ్రంగా కష్టపడుతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్‌తో ‘రాజా సాబ్’ సినిమాపై నెలకొన్న అంచనాలు రెట్టింపు కావడం ఖాయమని తెలుస్తోంది.
రాజా సాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.