ప్రముఖ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రమణ్యం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసారు, ఇందులో రమ్య పసుపులేటి మరియు అంకిత్ కొయ్య కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మంచి ప్రదర్శన తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయింది. మారుతీ నగర్ సుబ్రమణ్యం సెప్టెంబర్ 20 నుండి ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది.
దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిబిఆర్ సినిమాస్ మరియు లోకమాత్రే క్రియేషన్స్ బ్యానర్లపై బుజ్జి రాయుడు పెంట్యాల మరియు మోహన్ కార్యా ఈ చిత్రాన్ని నిర్మించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.