త్వరలో ఆహా లోకి రానున్న “మారుతీ నగర్ సుబ్రమణ్యం”

త్వరలో ఆహా లోకి రానున్న “మారుతీ నగర్ సుబ్రమణ్యం”

Published on Sep 10, 2024 10:01 PM IST

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్ తదితరులు నటించిన కామెడీ ఎంటర్టైనర్ మారుతీ నగర్ సుబ్రమణ్యం. ఆగస్టు 23, 2024 న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహా వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఆహా వీడియో లో త్వరలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బుజ్జి రాయుడు పెంట్యాల నిర్మించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు