టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.
అయితే, ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్స్‌ను చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల టాక్.
ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను 2025 మే 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.