మాస్ ఫీస్ట్‌ను రెడీ చేస్తున్న ‘లైలా’

మాస్ ఫీస్ట్‌ను రెడీ చేస్తున్న ‘లైలా’

Published on Jan 29, 2025 6:00 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఈ మూవీ పై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ప్యూర్ మాస్ ఫోక్ సాంగ్‌ను ప్రముఖ రచయిత కమ్ సింగర్ పెంచల్ దాస్ ఈ సినిమాలో పాడుతున్నారు. దీనికి లియోన్ జేమ్స్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు. ఇక ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను జనవరి 31న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాట ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విశ్వక్ పర్ఫార్మెన్స్ చిత్రానికే హైలైట్‌గా ఉంటుందని.. ముఖ్యంగా లైలా పాత్రలో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. లైలా చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు