Viswam: ‘విశ్వం’లో మాస్ సాంగ్‌తో దుమ్ములేపనున్న గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించగా, ఈ చిత్రంతో ఆయన సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ చిత్ర పాటలు, ట్రైలర్‌లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘విశ్వం’ మూవీపై అంచనాలు పెరిగాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాపై ఆ అంచనాలు పెంచే విధంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని హీరో గోపీచంద్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని.. ఈ పండుగకు ప్రేక్షకులు ఈ పాటతో చిందులు వేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలోని మాస్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Stay Tuned..!#Viswam pic.twitter.com/t8JAUs9eeJ

— Gopichand (@YoursGopichand) October 8, 2024

Exit mobile version