ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు అవైటెడ్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ బి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి.
మరి ఈ చిత్రం సెన్సేషనల్ బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా జరుపుకుంటుండగా ఈ చిత్రానికి మన కూడా సాలిడ్ బిజినెస్ జరుపుతున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే నైజాం మార్కెట్ లో మాత్రం సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్ ఈ చిత్రానికి వచ్చినట్టుగా వినిపిస్తుంది. ఓ ప్రముఖ నిర్మాత పుష్ప 2 ఒక్క నైజాం హక్కులకే 100 కోట్ల ఆఫర్ అది కూడా అడ్వాన్స్ అమౌంట్ గా ఇచ్చినట్టుగా వినిపిస్తుంది.
ఇది మాత్రం నెవర్ బిఫోర్ నెంబర్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమా పట్ల క్రేజ్ కూడా ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆల్రెడీ వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ ఆగస్ట్ 15న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.