విజయ్ “గోట్” కి భారీ బడ్జెట్.. ఇందులో విజయ్ కే అంత మొత్తం

కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకడైన దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి మొదటి నుంచి మంచి అంచనాలు ఈ చిత్రం తమిళ నాట అందుకోగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వచ్చేస్తుంది.

అయితే ఈ దగ్గరకి వస్తున్నా సమయంలో నిర్మాతలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడి చేస్తున్నారు. ఇలా ఈ సినిమాకి ఏకంగా 400 కోట్ల బడ్జెట్ అయ్యినట్టుగా ప్రొడ్యూసర్స్ చెప్పడం వైరల్ గా మారింది. బడ్జెట్ 350 కోట్లు అయితే జి ఎస్ టి కలిపి 400 కి చేరింది అని నిర్మాత అర్చన కల్పత్తి రివీల్ చేశారు.

అలాగే ఇందులో బిజె ఒక్కడి రెమ్యునరేషన్ నే 200 కోట్లు అన్నట్టుగా టాక్. సో సినిమాకి అయ్యింది 150 కోట్ల లోపే ఉండొచ్చని చెప్పాలి. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు టెక్నికల్ గా కూడా భారీ ప్లానింగ్ లని చేసాడు సో ఈ మాత్రం అవుతుందని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఈ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version