ఆ ఒక్క ఫైట్ చాలట.. ‘సలార్’ ఎలా ఉంటుందో చెప్పడానికి

Published on Mar 1, 2021 9:04 pm IST

‘కెజిఎఫ్’ సినిమాతో ప్రశాంత్ నీల్ క్రేజ్, ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా దేశవ్యాప్తమయ్యాయి. ఈ ఇద్దరితో పనిచేయడానికి స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు సిద్ధంగా ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరే కలిసి పనిచేస్తే. ఆ ఫలితమే ‘సలార్’. ప్రశాంత్ నీల్ గత చిత్రాల్లో ఒకటైన ‘ఉగ్రం’కు ఇది తెలుగు రీమేక్ అంటున్నారు. సినిమా రీమేక్ అయినా కూడ పూర్తిగా భిన్నంగా ఉంటుందట. ప్రభాస్ ప్రజెంట్ స్టార్ డమ్ కు అనుగుణంగా సినిమాను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్.

ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే ఎక్కువగా హైలెట్ అవుతున్న అంశం సినిమాలోని యాక్షన్ కంటెంట్. వీరిద్దరూ యాక్షన్ ఎంటెర్టైనర్లకు పెట్టింది పేరు. కాబట్టి ‘సలార్’ సినిమాలో అదే ప్రధాన అంశమట. ప్రతి సీన్ ఒక ఎలివేషన్ అనేలా, ప్రతి ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అన్నట్టు ఉంటుందట. ఉదాహరణకు సినిమాలో సుమారు 300 మందితో ఒక ఫైట్ సీన్ ప్లాన్ చేశారట. అంటే ప్రభాస్ ఒక్కడే ఒకవైపు మిగతా 300 మంది ఒకవైపు అన్నమాట. దీన్నిబట్టి సినిమా లెవల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘కెజిఎఫ్’ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30 2022న రిలీజ్ చేయనున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :