“బాలయ్య 108” అనౌన్సమెంట్ కి మాస్ రెస్పాన్స్.!

Published on Aug 12, 2022 3:33 pm IST

లేటెస్ట్ గానే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న తన కెరీర్ 108వ సినిమాపై భారీ అనౌన్స్మెంట్ అధికారికంగా వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడితో ప్లాన్ చేసిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నిన్ననే ఓ క్రేజీ వీడియో గ్లింప్స్ తో అనౌన్స్ కాగా దానికి భారీ హైప్ వచ్చింది. మరి దర్శకుడు అనీల్ తన సోషల్ మీడియా నుంచి అనౌన్స్ చేసిన ఈ వీడియోకి అయితే ఈ ఒక రోజు లోపే మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

ట్విట్టర్ ఈ అనౌన్సమెంట్ కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దీనితో ఈ మాసివ్ రెస్పాన్స్ కి గాను దర్శకుడు అనిల్ రావిపూడి ఆడియెన్స్ మరియు సినిమా సంగీత దర్శకుడు థమన్ టెర్రిఫిక్ వర్క్ మరియు తన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. మొత్తానికి అయితే ఈ సినిమా జస్ట్ అనౌన్సమెంట్ తోనే రచ్చ లేపుతుందని చెప్పాలి. అలాగే రానున్న రోజుల్లో అయితే ఈ చిత్రం నుంచి మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :