‘రామాయణం’ కోసం అయోధ్య, మిథిలా నగరాల భారీ సెట్స్

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ లాస్ట్ మూవీ ‘యానిమల్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ ప్రెస్టీజియస్ ‘రామాయణం’ మూవీలో నటిస్తున్నాడు.

దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి సీతగా నటించనుంది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక కేజీఎఫ్ స్టార్ యశ్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మేకర్స్ అయోధ్య, మిథిలా నగరాలకు సంబంధించిన భారీ సెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ముంబైలో 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సెట్స్‌ను వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ ఎపిక్ మూవీ తొలి భాగాన్ని డిసెంబర్ 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version