ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాలతో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభినవ్ హీరోగా సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి క్లీన్ యూ (U) సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం ఫిబ్రవరి 23 వ తేదీన థియేటర్ల లోకి రానుంది. వైశాలి రాజ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.