ఈ సినిమా మీద కూడ బాలీవుడ్ కన్ను పడింది

Published on Jan 16, 2021 3:01 am IST

గత కొన్నాళ్ళుగ్గా బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు దక్షిణాది సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హిందీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్లో నడుస్తున్న లవ్ అండ్ ఫన్ ఎంటెర్టైనర్ ఫార్ములాతో బోర్ ఫీలవుతున్నారు. లార్జర్ థన్ లైఫ్ సినిమాల కోసం చూస్తున్నారు. అంటే అచ్చంగా మాస్ ఎంటెర్టైనర్లు, కొత్త తరహా కథలు అన్నమాట. అందుకే హిందీ మేకర్స్ దృష్టి దక్షిణాది పరిశ్రమల మీద పడింది.

‘బాహుబలి ,కేజీఎఫ్, సాహో’ లాంటి సినిమాలు అక్కడి వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఇక్కడ హిట్టవుతున్న సినిమాలను రీమేక్ చేసే పని పెట్టుకున్నారు. విడుదలై హిట్టవ్వడమే ఆలస్యం వెంటనే హక్కులు కొనేస్తున్నారు. ఇప్పటికే పలు సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అవుతుండగా ఇప్పుడు విజయ్ ‘మాస్టర్’ చిత్రాన్ని కూడ రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘మాస్టర్’ తమిళంలో భారీ విజయం దిశగా దూసుకుపోతుండగా తెలుగులో కూడ మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఎండేమోల్ షైన్ ఇండియా, మురాద్ కేతాని, 7 స్క్రీన్ స్టూడియోస్ కలిసి ఈ రీమేక్ ను నిర్మించనున్నాయి. ఇందులో హీరో, విలన్ పాత్రల్లో ఏ స్టార్లు నటిస్తారు, దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

సంబంధిత సమాచారం :