థియేటర్లలోనే సినిమా అంటున్న స్టార్ హీరో

Published on Sep 24, 2020 12:58 am IST

కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు నాలుగైదు నెలలుగా మూతబడి ఉన్నాయి. దీంతో ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ సడలింపులు ఇఛ్చినా సినిమా హాళ్ల ఓపెనింగ్ మీద క్లారిటీ రాలేదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా భయం కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్ఛే ధైర్యం చేస్తారా, ఓటీటీ వీక్షణకు అలవాటుపడిన జనం మల్టీప్లెక్స్ థియేటర్ల వైపు చూస్తారా అనే అనుమానం ఉంది. భయాలు, అపోహలు తొలగి జనం థియేటర్లకు రావాలంటే పెద్ద సినిమాలు విడుదలకావాల్సిందే.

అప్పుడే పెద్ద హీరోల స్టార్ డమ్ జనాన్ని మళ్ళీ థియేటర్లకు అలవాటుపడేలా చేస్తుందనేది వారి ఉదేశ్యం. ఏ పరిశ్రమకు చెందిన ఎగ్జిబిటర్స్ ఆ పరిశ్రమలోని పెద్ద సినిమాల మీద హోప్స్ పెట్టుకున్నారు. అవే వారి తలరాతను మారుస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. తమిళంలో విడుదలకు రెడీగా ఉన్న విజయ్, సూర్య, ధనుష్ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయితే మళ్ళీ పాత వాతావరణం వస్తుందని అక్కడి ఎగ్జిబిటర్లు భావించారు. కానీ ఈలోపు సూర్య తన ‘సూరరై పొట్రు’ ఓటీటీ ద్వారా విడుదలవుతుందని ప్రకటించారు.

ఈ వార్తతో ఎగ్జిబిటర్లు సగం డీలాపడగా ఈమధ్య విజయ్ ‘మాస్టర్’ కూడా ఓటీటీలోనే విడుదలని వార్తలు రావడం వారిని ఆందోళనకు గురిచేసింది. కానీ తాజాగా స్పందించిన చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్ ఓటీటీలో విడుదలయ్యే ప్రసక్తే లేదు. తప్పకుండా థియేటర్లలోనే వస్తుంది. సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాక విడుదల తేదీని నిర్ణయిస్తాం. ప్రభుత్వంతో థియేటర్ల యాజమాన్యాలు చర్చిస్తున్నాయి’ అంటూ స్పష్టత ఇచ్చ్చారు. దీంతో ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More