సమీక్ష : “మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా” – స్లో గా సాగే ఎమోషనల్ జర్నీ

Masthu Shades Unnai Ra Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అభినవ్ గోమఠం, వైశాలి రాజ్, అలీ రెజా, మోయిన్, ఆనంద చక్రపాణి, లావణ్య రెడ్డి తదితరులు

దర్శకుడు: తిరుపతిరావు

నిర్మాతలు: ఆరెంరెడ్డి, ప్రశాంత్. వి, భవానీ కాసుల

సంగీత దర్శకులు: సంజీవ్. టి

సినిమాటోగ్రాఫర్: సిద్ధార్థ స్వయంభూ

ఎడిటింగ్: రవితేజ

సంబంధిత లింక్స్: ట్రైలర్

మంచి కామెడీ పాత్రల్లో నటించిన అభినవ్ గోమతం తొలిసారిగా లీడ్ రోల్ లో నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. తిరుపతిరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైశాలి రాజ్‌ కథానాయిక గా నటించింది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

మనోహర్ (అభినవ్ గోమఠం) ఒక ఆర్టిస్ట్. పెళ్లి రోజున పెళ్లి కూతురు పారిపోవడంతో అతని లైఫ్ తలకిందులు అవుతుంది. మనోహర్ చదువుకోలేదు. జీవితంలో స్థిరపడకపోవడంతో, పెళ్లికూతురు వేరే వ్యక్తితో పారిపోతుంది. బంధువులు అతడిని చిన్నచూపు చూస్తారు. ఈ సంఘటనతో మనోహర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ షాప్ ను పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఫోటోషాప్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఉమ (వైశాలి రాజ్) ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మనోహర్ చేరాడు. మనోహర్‌కి రాహుల్ (అలీ రెజా)తో విభేదాలు ఉన్నాయి. మనోహర్ జీవితంలో తర్వాత ఏమి జరిగింది? అనేది కథ యొక్క సారాంశం.

ప్లస్ పాయింట్స్:

లైఫ్ లో ఏదో సాధించాలి అని ఆకాంక్షించే ఓ యువకుడి జీవితాన్ని చూపించే సిన్సియర్‌ ప్రయత్నమే ఈ చిత్రం. అభినవ్ గోమఠం తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి తన నటనతో ఆకట్టుకున్నాడు. అతని పాత్రలో ఎలాంటి కామెడీ యాంగిల్ లేదు, అయినప్పటికీ అభినవ్ నటుడుగా తన నటనతో తనదైన ముద్ర వేశాడు. ఖచ్చితంగా, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అభినవ్ కెరీర్ లో మరో యాంగిల్ ను ప్రదర్శిస్తుంది అని చెప్పాలి. ఈ చిత్రం అతనికి వైవిధ్యమైన పాత్రలను అందించడంలో సహాయపడవచ్చు.

లేడీ లీడ్ రోల్ లో నటించిన వైశాలి రాజ్ తన పాత్రలో ఒదిగి ఆకట్టుకుంది. ఆమె సన్నివేశాలు, రొమాంటిక్ ట్రాక్ చూడటానికి చక్కగా ఉన్నాయి. నిజాల్‌గల్ రవి ఇందులో కీలక పాత్ర పోషించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మొయిన్ మహ్మద్, అలీ రెజా, ఆనంద చక్రపాణి, లావణ్య రెడ్డి వంటి వారు తమ తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు.

ఫస్ట్ హాఫ్ మరియు సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. హీరో స్నేహితుని సిట్యుయేషనల్ కామెడీ అలరిస్తుంది. అభినవ్ వ్యాపారంలో పెద్ద ఎదురుదెబ్బను అనుభవిస్తాడు. దానిని అందరి నుండి దాచడానికి ప్రయత్నిస్తాడు. ఇందుకు సంబంధించి వచ్చే సన్నివేశాలను చక్కగా చూపించడం జరిగింది. రచన చాలా వరకు సెన్సిబుల్‌గా ఉంది. కొన్ని డైలాగులు ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఎమోషనల్ యాంగిల్ విషయంలో టీమ్ ఇంకాస్త కేర్ తీసుకుంటే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చాలా బాగుండేది. ఈ చిత్రం ఒక పాత్ర యొక్క ప్రయాణానికి సంబంధించినది కాబట్టి, కథనంలో మరింత ఎమోషనల్ డెప్త్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాలో ఉన్న కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అంతగా ఆకట్టుకోవు.

ఈ చిత్రానికి మరో పెద్ద మైనస్ టైటిల్ అని చెప్పాలి. ఎంచుకున్న టైటిల్ కి, సినిమా కాన్సెప్ట్ పూర్తిగా భిన్నంగా ఉంది. టైటిల్ ఎక్కువగా సినిమా గురించి ప్రేక్షకులలో ఒక అవగాహనను సృష్టిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మేకర్స్ ఫాన్సీ పేరుతో వెళ్ళడం ద్వారా తప్పుడు అంచనాలను సెట్ చేసారు అని చెప్పవచ్చు.

క్లైమాక్స్ పోర్షన్ చాలా ల్యాగ్ ఉంది. చివర్లో ఏం జరుగుతుందో తెలియడంతో సినిమా కూడా కాస్త బోరింగ్‌గా మారింది. సినిమాలో చాలాసార్లు చర్చించబడిన ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ను క్లారిటీ గా ప్రెజెంట్ చేయలేదు.

సాంకేతిక విభాగం:

సంజీవ్ సంగీతం మినహా, ఇతర సాంకేతిక అంశాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఇంకా బాగుండేవి. ఎడిటింగ్ బాగోలేదు, ఎందుకంటే సినిమా చాలా లెంగ్తీ గా, నెమ్మదిగా అనిపిస్తుంది.

దర్శకుడు తిరుపతిరావు సింపుల్ మూమెంట్స్ మరియు సిట్యుయేషనల్ కామెడీతో సినిమాను బాగానే హ్యాండిల్ చేశారు. సినిమాలోని కొన్ని పార్ట్‌లు బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ, ఎమోషనల్ పార్ట్‌కి మరింత మెరుగ్గా ఎగ్జిక్యూషన్ అవసరం.

తీర్పు:

మొత్తం మీద, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రం జీవితంలో ఏదైనా పెద్దగా చేయాలనుకునే వ్యక్తి యొక్క జర్నీ ను చూపిస్తుంది. ఈ ప్రయత్నం నిజాయితీగా ఉన్నప్పటికీ, ఎమోషనల్ యాంగిల్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాను వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళడం లో ఎమోషనల్ డెప్త్ ఉండి ఉంటే బాగుండేది. అభినవ్ గోమఠం ఒక డిఫరెంట్ రోల్ ను చేశాడు. తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. లేడీ లీడ్ రోల్ లో నటించిన వైశాలి రాజ్ కూడా తన పాత్రలో ఆకట్టుకొనే నటనను ప్రదర్శించడం జరిగింది. సినిమాలో కొన్ని ఆకట్టుకొనే సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్ మరియు అక్కడక్కడా స్లో గా సాగే సన్నివేశాలు విసుగును తెప్పిస్తాయి. వాటిని మీరు విస్మరిస్తే ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version