వరల్డ్ వైడ్ మొదటి రోజు అదరగొట్టిన “మత్తు వదలరా” వసూళ్లు.!

 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీసింహ హీరోగా ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా కమెడియన్ సత్య సాలిడ్ రోల్ లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మత్తు వదలరా 2”. మరి ఫస్ట్ పార్ట్ హిలేరియస్ హిట్ గా నిలవగా ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం కూడా మంచి టాక్ తెచ్చుకుని అదరగొట్టింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
యూఎస్ మార్కెట్ లో ఏకంగా 3 లక్షలకి పైగా డాలర్స్ మార్క్ ని అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 5.3 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. దీనితో మరోసారి ఆడియెన్స్ అదిరే రెస్పాన్స్ ని అందించారు అని చెప్పాలి. ఇక ఈ చిత్రంకి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ వీకెండ్ లో ఈ సినిమా మరింత సాలిడ్ నంబర్స్ అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి.
Exit mobile version