సమీక్ష : మత్తు వదలరా 2 – డీసెంట్ గా సాగే కామెడీ క్రైమ్ డ్రామా

Mathu Vadalara 2 Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, అజయ్, ఝాన్సీ, తదితరులు

దర్శకుడు: రితేష్ రానా

నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు

సంగీత దర్శకుడు: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం

ఎడిట‌ర్ : కార్తీక శ్రీనివాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ “మత్తు వదలరా 2” కూడా ఒకటి. శ్రీ సింహా హీరోగా, సత్య మరో ముఖ్య పాత్రలో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

గత సినిమాకి లింకప్ గానే బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాసు (సత్య) ఇద్దరూ కూడా జాబ్ డబ్బులు లేని సమయంలో ఒక హీ టీం (హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ) లో ఏజెంట్స్ గా జాయిన్ అవుతారు. మరి ఆ హెడ్ కి లీడ్ (దీప) రోహిణి అండర్ లో పని చేస్తారు. కిడ్నాప్ కేసులు సాల్వ్ చేస్తూ అందులో కొంచెం డబ్బు తస్కరిస్తూ లైఫ్ లీడ్ చేస్తారు. ఈ సమయంలో వారి దగ్గరకి ఓ మిస్సింగ్ కేసు వస్తుంది. మరి ఈ కేసు నుంచి బాబు, యేసుదాసు లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? అక్కడ సర్క్యులేట్ అవుతున్న స్లేవ్ డ్రగ్ ఏంటి? మర్డర్ కేసులో బాబు, యేసుదాసు ఎలా ఇరుక్కున్నారు? దీని వెనుక ఉంది ఎవరు? వీళ్ళు తప్పించుకున్నారా లేదా తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఫస్ట్ పార్ట్ మత్తు వదలరా కి మాంచి క్రేజ్ ఆడియెన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలా దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం కూడా ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ ని అందించింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా కమెడియన్ సత్య మరోసారి షో స్టీలర్.. అదే తన పెర్ఫార్మన్స్ తో షో ని తస్కరించాడు అని చెప్పాలి. సినిమాలో తన కామెడీ టైమింగ్ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ డోస్ లో ఉంది.

తనపై ప్రతి సీన్ కూడా ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సెకండాఫ్ లో తన మెగా ట్రీట్ కూడా అదిరింది. ఇంట్రెస్టింగ్ గా తనలో ఉన్న మంచి డాన్సర్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే శ్రీ సింహా మరోసారి తన రోల్ లో అదరగొట్టాడు. తన పాత్ర తాలూకా హావభావాలు మాత్రమే కాకుండా మంచి పర్సనాలిటీలో తను కనిపించి తన రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. అలాగే తనకి సత్యకి నడుమ అన్నీ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి.

అలాగే హీరోయిన్ ఫారియా అబ్దుల్లా హీ టీమ్ లో ఒక సాలిడ్ లేడీగా ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పాలి. తన లుక్స్ కానీ గ్లామర్ షో తో కూడా ఫారియా సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక వీరితో పాటుగా వెన్నెల కిషోర్ తన రోల్ లో క్రేజీగా చేశాడని చెప్పాలి. తనపై కొన్ని కామెడీ సీన్స్, థ్రిల్ సీన్స్ బాగున్నాయి. ఇక వీరితో పాటుగా సునీల్, అజయ్, రోహిణి తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా సినిమాలో కొన్ని ట్విస్ట్ లు, అలాగే ఓరి నా కొడకా సీన్స్ ఇంకా పలు సన్నివేశాల్లో చిన్న చిన్న కామెడీ డీటెయిల్స్ మత్తు వదలరా సినిమా లవర్స్ ని మెప్పిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం మొదటి భాగం మంచి హిట్ అవ్వడానికి కారణం కామెడీ సహా థ్రిల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా కుదరడం అని చెప్పాలి. అయితే ఈసారి కామెడీ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యినప్పటికీ థ్రిల్ ఎలిమెంట్స్ మాత్రం ఇంకొంచెం ఎగ్జైట్ చేసే విధంగా ఉంటే బాగుండేది. ఈ సినిమాలో ఉన్నవి కూడా పర్వాలేదు కానీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నవాటితో పోలిస్తే ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.

అలాగే కొన్ని థ్రిల్ సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. సెకాండఫ్ లో నడిచే కథనం ట్విస్ట్ లు సోసో గానే ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో చాలా మంది ఫేవరెట్ సీరియల్ ఓరి నా కొడకా సీన్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండు అనే భావన కలుగుతుంది.

 

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి టెక్నికల్ టీం లో మరోసారి సంగీత దర్శకుడు కాల భైరవ సాలిడ్ వర్క్ అందించాడు. తన పాటలు, స్కోర్ సినిమాలో మూడ్ ని మ్యాచ్ చేస్తూ కనిపిస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, మెయిన్ గా డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

ఇక దర్శకుడు రితేష్ రానా విషయానికి వస్తే.. మరో సారి తాను తన మార్క్ కామెడీ థ్రిల్స్ ని అందించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. కామెడి వరకు చాలా సీన్స్ యూనిక్ గా డిజైన్ చేసుకొని నవ్వించే చిన్న చిన్న డీటెయిల్స్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. అలాగే రాసుకున్న థ్రిల్ లైన్ కూడా బాగానే ఉంది కాని అది మరీ అంత ఎంగేజ్ చేసే విధంగా అనిపించదు అని చెప్పాలి. ఓకే అనిపించే రేంజ్ లో ఈ ఫ్యాక్టర్ మాత్రం అనిపిస్తుంది. అలాగే సెకాండఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ముందు అంతా కొంచెం డల్ గా నడిపించినట్టు అనిపిస్తుంది. ఇది మినహా సినిమాలో తను మంచి వర్క్ కామెడీ పట్ల తన కమాండ్ ని తను బాగా కనబరిచాడు.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే క్రేజీ కామెడి థ్రిల్లర్ మత్తు వదలరా కి సీక్వెల్ గా వచ్చిన ఈ “మత్తు వదలరా 2” కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. మెయిన్ గా సింహా సహా సత్య సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ అని చెప్పాలి. కామెడీ వరకు సినిమాలో బాగానే వర్కవుట్ అయ్యింది. థ్రిల్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ అంశం మాత్రం ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. వీటితో ఈ సినిమాని మూవీ లవర్స్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version