ఫన్ రైడ్ తో ఆకట్టుకున్న “మత్తు వదలరా 2” ట్రైలర్!


దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ను మత్తు వదలరా 2 పేరిట తెరకెక్కించారు మేకర్స్. నేడు ఈ చిత్రం ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ డిజిటల్ గా రిలీజ్ చేశారు. శ్రీసింహా, సత్య, సునీల్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఫన్ ఎలిమెంట్స్ తో పాటుగా, క్రైమ్ కి సంబందించిన కొన్ని కీలక అంశాలు ట్రైలర్ లో చూపించారు. ఈసారి సినిమా డబుల్ ఫన్, థ్రిల్స్ కి గురి చేయనుంది అని ట్రైలర్ ను చూసి చెప్పవచ్చు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 13 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version