2 రోజుల్లో 11 కోట్లతో “మత్తు వదలరా 2”


గత శుక్రవారం రోజున థియేటర్లలోకి వచ్చిన మత్తు వదలరా 2 చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, మంచి రివ్యూస్ కూడా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ చిత్రం కేవలం 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

సినిమాను చూసిన సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. రితేష్ రాణా దర్శకత్వంలో శ్రీ సింహ కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు. నేడు ఆదివారం కావడంతో, ఈరోజు కూడా వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉంది.

Exit mobile version