హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్ లోకి “మత్తు వదలరా 2”


ఈ శుక్రవారం రిలీజైన మత్తు వదలరా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. నార్త్ అమెరికాలో కూడా సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే 500కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

శ్రీ సింహ కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకత్వం వహించగా, కాల భైరవ సంగీతం అందించాడు. క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version