యూఎస్ లో “మత్తు వదలరా 2” సాలిడ్ హోల్డ్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ సింహ హీరోగా టాలెంటెడ్ కమెడియన్ సత్య కూడా మరో ప్రధాన పాత్రలో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన క్రేజీ సీక్వెల్ చిత్రం “మత్తు వదలరా 2” తో వచ్చి మళ్ళీ సాలిడ్ హిట్ ని అందుకున్నారు. మరి క్రేజీ ప్రమోషన్స్ అందుకు తగ్గట్టుగానే సినిమాలో కంటెంట్ కూడా ఉండేసరికి తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా మత్తును వదలరా 2 అదరగొడుతుంది.

అయితే ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో సాలిడ్ హోల్డ్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఫస్ట్ వీకెండ్ కే హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకున్న ఈ చిత్రం ఇప్పుడు 7 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తుంది. ఇక దీనితో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ ని దాటే ఛాన్స్ కూడా తప్పకుండ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా కాల భైరవ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version