మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. వరుణ్ తేజ్ వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేశారు మేకర్స్. వైజాగ్‌లో ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 10న నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఈ సర్టిఫికెట్ పర్ఫెక్ట్ అని అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 39 నిమిషాలుగా లాక్ చేశారు మేకర్స్.
ఓ పక్కా కమర్షియల్ చిత్రానికి ఈ రన్‌టైన్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన పర్ఫార్మెన్స్‌తో సర్‌ప్రైజ్ చేయనుండగా.. అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జివి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.