Matka: ‘మట్కా’ రిలీజ్ డేట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది!

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’(Matka) ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాను వరుణ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా మేకర్స్ రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ‘మట్కా’ చిత్ర రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 1న ఉదయం 11.05 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది.

ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డా.విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version