సమీక్ష : మట్కా – కేవలం కొన్ని సీన్స్ వరకు మాత్రమే

సమీక్ష : మట్కా – కేవలం కొన్ని సీన్స్ వరకు మాత్రమే

Published on Nov 15, 2024 12:08 AM IST
Matka Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, జాన్ విజయ్, సత్యం రాజేష్, రవి శంకర్, సలోని.

దర్శకుడు : కరుణ కుమార్

నిర్మాతలు : వైరా ఎంటర్టైన్మెంట్స్

సంగీత దర్శకుడు : జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ : ఏ కిషోర్

ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “మట్కా”. ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ల తర్వాత అప్పటి వైజాగపట్టణంకి వాసు(వరుణ్ తేజ్) తన చిన్న వయసులోనే తన తల్లితో వలస వస్తాడు. అక్కడ నుంచి వాసు జీవితం ఎలా టర్న్ అయ్యింది. అక్కడ లోకల్ గా పవర్ఫుల్ వ్యక్తులు కేబి (జాన్ విజయ్), అలాగే నాని (కిషోర్ కుమార్ జి)లు ఎలా తన లైఫ్ లోకి వస్తారు? ఈ క్రమంలో వాసు ఎలా ఎదిగాడు..? తను కనిపెట్టిన “మట్కా” జూదం మూలాన ఏం జరిగింది? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో తొలుత మాట్లాడుకోవాల్సింది వరుణ్ గురించే అని చెప్పాలి. తన ఫిల్మోగ్రఫీలో పలు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా నటుడుగా భిన్నమైన షేడ్స్ చేస్తూ వచ్చాడు. అలా మట్కాలో కూడా తనలోని వెర్సటాలిటీని కనబరిచాడు. మొత్తం మూడు షేడ్స్ లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది. మూడు షేడ్స్ కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మాటతీరు ఆకట్టుకున్నాయి. ఇంకా తన కూతురితో సింగిల్ టేక్ సీన్‌ను వరుణ్ మంచి ఎమోషన్స్ తో పండించాడు.

అలాగే మీనాక్షి చౌదరి తన రోల్ లో సూటయ్యింది. ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే ఇతర నటీనటులు నవీన్ చంద్ర, రవి శంకర్, సలోని తదితరులు డీసెంట్ పెర్ఫార్మన్స్ లు అందించారు. ఇక నెగిటివ్ షేడ్ లో కనిపించిన జాన్ విజయ్, కిషోర్ కుమార్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహి సాంగ్ వరకు మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. ఇక సినిమాలో వరుణ్ రోల్ ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే తనపై కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లోని ట్విస్ట్ లు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలోని థీమ్ పర్వాలేదనిపిస్తుంది.. కానీ కథనం నడుస్తున్న కొద్దీ కొన్ని అంశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇది సెకండాఫ్ లో ఎక్కువగా అనిపిస్తుంది. వీటితో సినిమాలో కేవలం కొన్ని అంశాలు మాత్రమే ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తాయి.

అలాగే సినిమాలో అంతగా ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఒకటే సీరియస్ టోన్ లో మూవీ సాగుతుంది. పైగా డ్రామా కూడా ఈ గ్యాంగ్ స్టర్ సినిమాలో ఎక్కువయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే మరీ ఎగ్జైట్ చేసే ఎలివేషన్స్ లేకపోవడం.. సినిమాలో కొన్ని పాటల కారణంగా మరింత సాగదీత ఫీల్ కలుగుతుంది.

పాటలు వినడానికి పర్వాలేదు కానీ ఒక ఫ్లోలో అవి అనవసరం అనిపిస్తుంది. అలాగే నటుడు జాన్ విజయ్ రోల్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. వీటితో మట్కా మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో సాలిడ్ టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి. మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒకప్పుటి విశాఖను యూనిట్ చాలా సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ సెట్టింగ్స్ కానీ దర్శకుడు తీసుకున్న ప్రతీ డీటెయిల్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా టెక్నికల్ పరంగా మట్కా ని పక్కాగా ప్లాన్ చేశారు. అలాగే జీవి ప్రకాష్ స్కోర్ బాగుంది. పాటలు కూడా పర్వాలేదు. ఏ కిశోర్ కుమార్ కెమెరా పనితనం సినిమా టోన్ కి తగ్గట్టుగా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఫాస్ట్ పేస్ లో చేయాల్సింది.

ఇక దర్శకుడు కరుణ కుమార్. విషయానికి వస్తే.. తన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు మట్కా తో వచ్చారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు అలాగే ముఖ్యంగా వరుణ్ రోల్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటుగా అప్పటి డీటెయిలింగ్స్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కానీ సినిమాని మాత్రం తను పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా నడిపించలేకపోయారు అని చెప్పక తప్పదు. కథనం వెళుతున్న కొద్దీ చప్పబడుతున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ తో పలికించిన కథలు, ఫిలాసఫీ బాగున్నాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది. వీటితో కథనాన్ని మరింత టైట్ గా ఫాస్ట్ పేస్ లో ఏమన్నా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ జూదపు డ్రామా “మట్కా” లో మరోసారి వరుణ్ తేజ్ తన సిన్సియర్ అటెంప్ట్ తో ఇంప్రెస్ చేస్తాడు. అలాగే సినిమాలో రోల్ మెప్పిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో సినిమా అంత ఎగ్జైటింగ్ గా ఆడియెన్స్ ని కట్టిపడేసే రేంజ్ లో అనిపించదు. కేవలం కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా చప్పగానే సాగుతుంది. వీటితో మట్కా చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు