మట్కా టీజర్‌కి సాలిడ్ రెస్పాన్స్.. ఏకంగా 2 మిలియన్ వ్యూస్

మట్కా టీజర్‌కి సాలిడ్ రెస్పాన్స్.. ఏకంగా 2 మిలియన్ వ్యూస్

Published on Oct 6, 2024 1:00 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ నుంచి టీజర్‌ని లాంచ్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని దర్శకుడు కరుణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, పూర్తి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ టీజర్ కట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ టీజర్ నెట్టింట దూసుకుపోతుంది. వరుణ్ తేజ్ పలు వేరియేషన్స్, గెటప్స్‌లో నటిస్తూ చూపిన సత్తాకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ వ్యూస్‌కి పైగా దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. తమ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి లేడీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నవీన్ చంద్ర ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు