మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ చెప్పడంతో ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘మట్కా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే హైప్ తీసుకొచ్చారు మేకర్స్.
ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ కట్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. వైజాగ్ సిటీ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో ఏమీ లేని దగ్గర్నుంచి అన్నీ తానయ్యే వరకు హీరో ఎలా ఎదిగాడనేది మనకు చూపించబోతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గెటప్స్‌లో వేరియేషన్స్ ప్రేక్షకులను, అభిమానులను అబ్బురపరుస్తున్నాయి.
అటు కరుణ కుమార్ మార్క్ టేకింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమాలో హీరో చెప్పే డైలాగులు కూడా సాలిడ్‌గా ఉన్నాయి. అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఈ సినిమాలో అలరించనున్నారు. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు జీవి.ప్రకాశ్ కుమార్ సంగీతం బోనస్‌గా మారనుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నవంబర్ 14న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.