బాలు గారు తెలుగులో చివరి రెండు పాటలు ఇవేనా?

బాలు గారు తెలుగులో చివరి రెండు పాటలు ఇవేనా?

Published on Sep 26, 2020 8:00 AM IST

నిన్నటితో ప్రపంచ గాత్రంలో ఒక అత్యద్భుతమైన స్వరం మూగబోయింది. సంగీత కళామతల్లి ముద్దు బిడ్డ ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం పోరాడి అలసి శాశ్వతంగా స్వర్గంలో సేద తీసుకోడానికి జ్ఞ్యాపకాలు మిగిల్చి పయనమయ్యారు. అయితే ఇప్పటి వరకు పదుల సంఖ్యల భాషల్లో వేలాది పాటలను ఆలపించారు. ముఖ్యంగా మన తెలుగు భాషలోనే ఎన్నో వేల కొలది పాటలను తన మధురమైన గాత్రంతో అందించి రంజింపజేశారు.

సందర్భం ఏదైనా సరే హీరోకు తగ్గట్టుగా అచ్చు వారే పాడారా అన్నట్టుగా పాడటం ఒక్క బాలు గారికే చెల్లుతుంది. అలాంటి రెండు పాటలనే బహుశా మన తెలుగులో చివరిగా ఆలపించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇంట్రో సాంగ్ అంటే అది ఎంత పవర్ ఫుల్ ఉంటుందో తెలిసిందే. అంతటి పవర్ ఫుల్ ను ఈ ఏడాది విడుదల కాబడిన “దర్బార్” తమిళ్ మరియు తెలుగు ఇంట్రో సాంగ్ “దుమ్ము ధూళి” ను ఆయనే పాడారు. అంతే కాకుండా మన తెలుగు సంగీత ప్రపంచాన్ని ఇపుడు ఒక ఊపు ఊపుతున్న థమన్ కు బాలు గారికి కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

అలాగే తాను మాస్ మహారాజ్ రవితేజ తో తీసిన “డిస్కో రాజా” లో ఒక మెలోడియస్ వింటేజ్ సాంగ్ కు ఆయనను తీసుకున్నారు. “నువ్వు నాతో ఏమన్నావో” అనే సాంగ్ కూడా మనం ఈ ఏడాదిలోనే చూసాము. ఈ ఏడాది జనవరిలోనే ఈ రెండు చిత్రాలు వెండితెర మీద విడుదలయ్యాయి. అంతే కాకుండా ఈ రెండు పాటలు కూడా పెద్ద చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన గాత్రాలను అందించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు