“మజాకా” ఫస్ట్ సింగిల్.. బ్యాచిలర్స్ మనసులోని మాటలే ఈ పాట

“మజాకా” ఫస్ట్ సింగిల్.. బ్యాచిలర్స్ మనసులోని మాటలే ఈ పాట

Published on Jan 29, 2025 10:40 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా అలాగే రావు రమేష్ మరియు అన్షు సాగర్ లు కూడా జోడిగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన మరో సాలిడ్ ఎంటర్టైనర్ నే “మజాకా”. ఇటీవల వచ్చిన టీజర్ తో ప్రామిసింగ్ గా అనిపించిన ఈ చిత్రం నుంచి ఇపుడు బ్యాచిలర్స్ ఆంథెమ్ అంటూ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ వదిలారు.

మరి ఈ సాంగ్ మాత్రం బ్యాచిలర్స్ కి పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా ఉందని చెప్పాలి. మెయిన్ గా రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం బ్యాచిలర్స్ మనసులోని మాటల్నే పాటగా కూర్చినట్టు ఉందని చెప్పాలి. దీనితో పాటుగా తన తండ్రిపై నడిచే సాహిత్యం కూడా బాగుంది.

ఇక ఈ సాంగ్ కి లియోన్ జేమ్స్ ఇచ్చిన ట్యూన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ కాగా ఈ సాంగ్ లో సందీప్ కిషన్, రావు రమేష్ లు అదరగొట్టారని చెప్పాలి. వైజాగ్ లో చూపించిన దృశ్యాలు బాగున్నాయి. మొత్తానికి అయితే ఫస్ట్ సింగిల్ గా మంచి సాంగ్ ని మేకర్స్ వదిలారు. ఇక ఈ చిత్రానికి రాజేష్ దండ, ఉమేష్ కే ఆర్ బన్సల్ నిర్మాణం వహించగా ఈ ఫిబ్రవరి 21న సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు