విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు సాగర్, మురళీ శర్మ, హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి
దర్శకుడు :త్రినాథరావు నక్కిన
నిర్మాత : రాజేష్ దండ, ఉమేష్ కే ఆర్ బన్సల్
సంగీతం : లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం : నిజర్ షఫీ
కూర్పు :చోటా కే ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి శివరాత్రి కానుకగా విడుదలకి వచ్చిన చిత్రాల్లో “మజాకా” కూడా ఒకటి. దర్శకుడు త్రినాథరావు నక్కిన, పీపుల్ స్టార్ సందీప్ కిషన్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వైజాగ్ కి చెందిన కృష్ణ(సందీప్ కిషన్) అలాగే తన నాన్న వెంకట రమణ(రావు రమేష్)లు సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు కానీ ఈ క్రమంలో కృష్ణకి పెళ్లి చెయ్యాలి అంటే వారి ఇంట్లో కనీసం ఒక్క ఆడ మనిషి కూడా లేదని ఆ సంబంధాలు అన్నీ వచ్చినట్టే వచ్చి ఆగిపోతాయి. దీనితో వెంకట రమణ ఇందుకు పరిష్కారంగా తాను పెళ్లి చేసుకొని అపుడు తన కొడుక్కి పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణకి మీరా(రీతూ వర్మ) వెంకట రమణకి యశోద(అన్షు సాగర్)లు పరిచయం అవుతారు. మరి వీరి పరిచయం తర్వాత వీరి లైఫ్ లు ఎలా టర్న్ అయ్యాయి. వీరి పెళ్లిళ్లు జరగాలి అంటే మీరా, యశోద లని ఎందుకు కలపాల్సి వస్తుంది. ఈ క్రమంలో బిజినెస్ మెన్ భార్గవ్ వర్మ(మురళీ శర్మ) కృష్ణ, వెంకట రమణలకి పెట్టిన కండిషన్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్ని సినిమాల్లో కథ ఎలా ఉన్నా కూడా తన కథనం మంచి హిలేరియస్ గా సాగుతుంది. అదే తనకి పట్టు కాగా ఇదే మూమెంట్ మజాకా లో కూడా చాలా మేరకు ప్లస్ అని చెప్పవచ్చు. ఫస్టాఫ్ లో పలు కామెడీ సీన్స్ అయితే ఓ రేంజ్ లో వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా సందీప్ కిషన్, రావు రమేష్ ల నడుమ కొన్ని సీన్స్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వీరిద్దరిపై కూడా ఇంట్రెస్టింగ్ ఎంట్రీ కామెడీ సీన్ నుంచే మంచి ఫన్ నరేషన్ కొనసాగుతుంది.
ఇలా ఫస్టాఫ్ అయ్యేవరకు కొన్ని ఎపిసోడ్స్ మంచి హిలేరియస్ గా వర్కౌట్ అవుతాయి. అలాగే కొన్ని ట్విస్ట్ లు ఎమోషన్స్ బాగున్నాయి. ఇక మెయిన్ లీడ్ నాలుగు నటీనటులు సినిమాలో మరో మేజర్ పలు అని చెప్పవచ్చు. సందీప్ కిషన్ తన మార్క్ లుక్స్ అండ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటే రావు రమేష్ మాత్రం ఇంకా హైలైట్ అని చెప్పవచ్చు. తండ్రి ఏజ్ లో తన కొడుక్కి పెళ్లి చేసేందుకు తాను లవర్ బాయ్ లా మారడం ఆ డ్రెస్సింగ్ అలాగే ఇంకా అన్షు సాగర్ తో పలు సీన్స్ లో వారి కెమిస్ట్రీ ఇంప్రెస్ చేస్తుంది.
ఇక హీరోయిన్ రీతూ వర్మ డీసెంట్ లుక్స్ లో సందీప్ కిషన్ తో మంచి కెమిస్ట్రీ కనబరిచింది. అలాగే వీరి నడుమ ఓ ఫోక్ సాంగ్ కూడా బాగుంది. అలాగే చాలా కాలం తర్వాత కనిపించిన అన్షు సాగర్ డీసెంట్ లుక్స్ లో కనిపించారు, రావు రమేష్ తో కొన్ని ఫన్ సీన్స్ తనపై బాగున్నాయి. ఇక వీరితో పాటుగా మురళీ శర్మ రోల్ సినిమాలో బాగుంది. దానిని అంతే పర్ఫెక్ట్ గా తాను కూడా ఎండ్ చేశారు. ఇంకా వీరితో పాటుగా హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డిలు మంచి కామెడీ టైమింగ్ తో నవ్విస్తారు. ఇంకా సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ మాత్రం నవ్విస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో బలమైన కథ లేకపోయినప్పటికీ ఓకే అనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో మరింత ఫన్ ఉంటుంది అనే ప్రామిస్ ని మేకర్స్ చేసే రేంజ్ లో ఇంటర్వెల్ ఇస్తారు. కానీ ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని సెకండాఫ్ లో ఆశించిన ఆడియెన్స్ కి మజాకా అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది అని చెప్పక తప్పదు.
సెకండాఫ్ కథనం చాలా వరకు బోర్ గా సాగుతుంది. ఇంకా చాలా సీన్స్ అసలు వర్కౌట్ కాలేదు. కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా కనిపిస్తాయి నవ్వు తెప్పించవు. ఇక వీటితో పాటుగా రావు రమేష్, అన్షు సాగర్ నడుమ కొన్ని సీన్స్ మరీ ఓవర్ గా చూసే ఆడియెన్స్ కి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అలాగే చాలా సీన్స్ ఆల్రెడీ ఎక్కడో చూసామే అన్న రేంజ్ లో కూడా అనిపించవు.
ఇలా సెకండాఫ్ అంతా ఒక రకమైన మిక్స్డ్ మిక్చర్ పొట్లంలా అనిపిస్తుంది. దీనితో ఒక ప్రామిసింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ అంత ఎంటర్టైనింగ్ గా అనిపించదు. అలాగే అన్షు సాగర్ రోల్ అసహజంగా కనిపిస్తుంది. తెలుగులో చాలా డైలాగ్స్ ఆమెపై నాచురల్ గా అనిపించవు. వినిపిస్తున్న డైలాగ్స్ కి పలుకుతున్న మాటకి పొంతన ఉండదు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. మేకర్స్ సినిమా అవసరానికి మేర మంచి ఖర్చు చేశారు. టెక్నికల్ టీంలో లియోన్ జేమ్స్ మ్యూజిక్ పర్వాలేదు. కొన్ని పాటలు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్ లో బాగోలేదు. నిజర్ షఫీ సినిమాటోగ్రఫీ బాగుంది. చోటా కే ప్రసాద్ సెకండాఫ్ లో బెటర్ గా ఎడిట్ చేయాల్సింది. కొన్ని బోర్ సన్నివేశాలు తగ్గించాల్సింది. ప్రసన్న కుమార్ బెజవాడ ఫన్ డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే పర్వాలేదు.
ఇక దర్శకుడు త్రినాధరావు నక్కిన విషయానికి వస్తే.. టాలీవుడ్ లో తనకి మంచి మార్క్ ఉంది కానీ ఈ సినిమాలో మాత్రం తన ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనింగ్ నరేషన్ మాత్రం మిస్ అయ్యింది అని చెప్పక తప్పదు. దాదాపు ట్రై చేశారు కానీ సెకండాఫ్ కూడా ఇంకా బెటర్ గా ఉండుంటే డెఫినెట్ గా మజాకా మరింత వర్కౌట్ అయ్యి ఉండేది. అయితే తాను మాత్రం నటీనటులల్లో ఒక్క రావు రమేష్ తప్ప మిగతా లీడ్ నుంచి ఇంకా బెటర్ పెర్ఫామెన్స్ లని రాబట్టాల్సింది. మెయిన్ గా అన్షు సాగర్ తెలుగు డబ్బింగ్ అయితే అసలు పెదాల మూమెంట్ లో కలవడమే లేదు. తనపై చాలా సీన్స్ అసహజంగా తెరకెక్కించారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మజాకా”లో లీడ్ నలుగురు నటీనటుల నడుమ పలు కామెడీ సీన్స్ ఆడియెన్స్ కి అక్కడక్కడా నవ్వు తెప్పిస్తాయి. అయితే పెద్దగా కథ లేకపోయినప్పటికీ ఒక ప్రామిసింగ్ ఫస్టాఫ్ తర్వాత ఇదే తరహాలో సెకండాఫ్ కూడా కొనసాగి ఉంటే బాగుండేది. అదే మూమెంటం కొనసాగి ఉంటే మజాకా డెఫినెట్ గా మరింత ఎంటర్టైనింగ్ గా అనిపించేది. మరి ఇది పక్కన పెడితే ఒక ఎంటర్టైనర్ ని చూడాలి అనుకునేవారికి మజాకా డీసెంట్ ట్రీట్ నే ఇస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team