సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా

సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా

Published on Nov 23, 2024 3:03 AM IST
Mechanic Rocky Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 22, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు.

దర్శకుడు : రవితేజ ముళ్ళపూడి

నిర్మాత : రామ్ తళ్లూరి

సంగీత దర్శకుడు : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి

ఎడిటింగ్ : అన్వర్ అలీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే శ్రద్దా శ్రీనాథ్ లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన చిత్రం “మెకానిక్ రాకీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక కథలోకి వస్తే రాకీ(విశ్వక్ సేన్) తన తండ్రి(నరేష్) పెట్టిన మెకానిక్ గ్యారేజ్ లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు కాగా తాను ఊహించని రీతిలో తన లైఫ్ లో జరిగిన ట్రాజడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రంకిరెడ్డి(సునీల్) వల్ల వచ్చిన సమస్య ఏంటి? ఇది కాకుండా తాను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి? ఈ క్రమంలో ప్రియా(మీనాక్షి చౌదరి) అలాగే మాయా(శ్రద్ధా శ్రీనాథ్) ల పాత్రలు ఏంటి? రాకీ ఎలా తన సమస్యలు సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో విషయంలో మేకర్స్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్ లో ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తుంది అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ లని చాలా సాదా సీదా మాస్ డ్రామాగా కట్ చేశారు కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పెట్టుకునేవారిని ఈ చిత్రం ఇంప్రెస్ చేస్తుందనడంలో డౌట్ లేదు. దీనితో విశ్వక్ మరోసారి తన స్క్రిప్ట్ సెలక్షన్ లో సాలిడ్ గా ఉంటాడు అని మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి.

ఇక సినిమాలో అయితే సెకండాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్ అని చెప్పాలి. క్రేజీ ట్విస్ట్ లు టర్న్ లతో మంచి కామెడీతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెళుతుంది. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మార్క్ మాస్ షేడ్ తో దుమ్ము లేపాడని చెప్పాలి. మంచి ఎమోషన్స్ తో పాటుగా పలు సీన్స్, వేరియేషన్స్ ని చూపించి తన ఫ్యాన్స్ కి మాస్ ఆడియెన్స్ కి మంచి అడ్రినలిన్ రష్ ఇస్తాడు అని చెప్పాలి.

అలాగే సినిమాలో ఇంకో మంచి విషయం మెయిన్ లీడ్ నటీనటులు అంతా వారి పాత్రలు సినిమాలో ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం అని చెప్పాలి. ఇక మీనాక్షి చౌదరి డీసెంట్ రోల్ లో కనిపించి మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. కానీ శ్రద్దా శ్రీనాథ్ మాత్రం తన రోల్ తో ఇంప్రెస్ చేస్తుంది. తనపై ట్విస్ట్ అయితే సినిమాలో టూ గుడ్ అని చెప్పొచు.

అలాగే 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ మంచి రోల్ ని ఈ సినిమాలో చేసాడు. అలాగే వీటితో పాటుగా సినిమాలో కనిపించే సోషల్ మెసేజ్, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం సినిమాలో మెప్పిస్తాయని చెప్పాలి. అలాగే వారితో పాటుగా హర్షవర్ధన్, వైవా హర్ష తదితరులు తమ పాత్రల్లో మెప్పిస్తారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దీనిని కొన్ని అనవసర సన్నివేశాలు పాటలతో ల్యాగ్ చేసారని చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో అన్ని పాటలు అవసరమే లేదని చెప్పాలి. ఇంకా ఫస్టాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. ఇంకా కథనం కూడా దాదాపు గెస్ చేసే విధంగా కూడా అనిపిస్తుంది.

అక్కడక్కడా ఒకటీ రెండు సన్నివేశాలు అయితే ఆడియెన్స్ ముందే ఊహించగలిగేలా అనిపిస్తాయి. మెయిన్ గా కొన్ని సీన్స్ ని పాటలు తీసేసి క్రిస్ప్ గా గాని సినిమాని కట్ చేసి ఉంటే మరింత థ్రిల్ చేసి ఉండొచ్చు.

ఆ పాటలు అవీ సినిమా ఫ్లోలో ఓవరాల్ సినిమా చూసాక అనవసరం అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా లైన్ ఓ తమిళ సినిమాని గుర్తు చేస్తుంది. జస్ట్ ఆ కోణంలో కనిపిస్తుంది కానీ ఇది డిఫరెంట్ యాంగిల్ లో సాగుతుంది. ఇంకా వీటితో పాటుగా విశ్వక్ పై కొన్ని కామెడీ సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్ అంతా నీట్ గా ఉంది. అలాగే జేక్స్ బిజోయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు బాగున్నాయి. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని షాట్స్ లో మంచి ఫ్రేమ్స్ ని తాను చూపించాడు. అలాగే అన్వర్ అలీ ఎడిటింగ్ లో సాంగ్స్ ని కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు రవితేజ ముళ్ళపూడి విషయానికి వస్తే తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారు అని చెప్పాలి. మెయిన్ గా సెకండాఫ్ ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రేసి స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్ లు ఆడియెన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఈ ఫ్లో లోకి సినిమాని తీసుకురావడానికి ఫస్టాఫ్ ని సాగదీతగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పలు ఎమోషన్స్ ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మెకానిక్ రాకీ” లో మంచి థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ షోతో కిల్ చేసాడు. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాలో మెప్పిస్తుంది. అయితే ఇదే తరహాలో ఫస్టాఫ్ కూడా ఉండి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ చిత్రం మరింత బెటర్ గా థ్రిల్ చేసి ఉండేది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఈ వారాంతానికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు