‘మెకానిక్ రాకీ’ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేసేది వీరే!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో విశ్వక్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన వివరాలను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో కాగ్నియర్ సినీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేయబోతున్నట్లు వారు తెలిపారు. మంచి ఫ్యాన్సీ రేటుకి ఈ చిత్ర ఓవర్సీస్ డీల్ లాక్ అయినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version