మాస్ అండ్ ఎంటర్టైనింగ్ గా “మెకానిక్ రాకీ” ట్రైలర్ 1.0

మాస్ అండ్ ఎంటర్టైనింగ్ గా “మెకానిక్ రాకీ” ట్రైలర్ 1.0

Published on Oct 20, 2024 5:17 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా దర్శకుడు రవితేజ ముళ్ళపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రం “మెకానిక్ రాకీ” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా ట్రైలర్ 1.0 రిలీజ్ కి తీసుకొచ్చారు.

మరి ఈ ట్రైలర్ మంచి ఎంటర్టైనింగ్ అంశాలతో పాటుగా మాస్ కి కావాల్సిన సాలిడ్ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా ఫిల్ చేసుకొని వచ్చింది అని చెప్పాలి. మరి ఈ ట్రైలర్ లో స్టార్టింగ్ అంతా హీరోయిన్స్ తో గాని నరేష్ తో గాని విశ్వక్ కామెడీ టైమింగ్ అదిరింది అని చెప్పాలి. అలాగే ఓ యంగ్ మెకానిక్ గా డాన్స్, అండ్ ఫైట్స్ లో విశ్వక్ సేన్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది అని చెప్పాలి.

ఇక సునీల్ విలన్ రోల్ లో కనిపిస్తుండగా తనకి విశ్వక్ కి నడుమ క్లాష్ సీన్స్ కూడా చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ట్రైలర్ లో జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక ఈ చిత్రానికి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ నవంబర్ 22న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు