షూటింగ్ ముగించుకున్న ‘మెకానిక్ రాఖీ’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాఖీ’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తుండగా యాక్షన్ కామెడీ మూవీగా ఇది అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాను నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ చేస్తు్న్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ను ముగించుకుంది చిత్ర యూనిట్. ఈ మేరకు షూటింగ్ సెట్‌లో కేక్ కట్ చేశారు టీమ్. షూటింగ్ ముగియడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

కాగా, ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌లతో పాటు సునీల్, హైపర్ ఆది తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version