వెబ్ సిరీస్ పూర్తి చేసిన సీనియర్ హీరోయిన్ !

Published on Sep 27, 2020 2:03 am IST


సీనియర్ హీరోయిన్ మీనా లాక్ డౌన్ కి ముందు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ కుమారన్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న నుండి ఈ వెబ్ సిరీస్ బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ అయి శరవేగంగా పూర్తి చేసుకుందట. ఇక ఈ వెబ్ సిరీస్ లో మీనా పాత్ర చాల కామిక్ గా ఉండనుందని తెలుస్తోంది. మరి మీనా కామెడీ చేయగలదా.. గతంలో మీనా నటించిన చాలా సినిమాలు చూస్తే.. మీనా అమాయకమైన రొమాంటిక్ కామెడీని బాగా చేస్తోంది. ఆయితే సీరియస్ కామెడీని ఎలా చేస్తోందో చూడాలి.

అన్నట్టు మీనా తమిళంలో ఒక సినిమాతో పాటు ఒక సీరియల్ లో కూడా నటిస్తోంది. అలాగే తెలుగులో కూడా రాజశేఖర్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా 90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ స్టార్ గా కొనసాగిన మీనా మొదటిసారి ఇలా ఓ వెబ్ సిరీస్ చేయడం, పైపెచ్చు మీనా ఈ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఉంది.

సంబంధిత సమాచారం :

More