దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘‘The GOAT’’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
విజయ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
విజయ్ గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. విజయ్ గారు పాలిటిక్స్‌కి ఎంటర్ అయ్యే ముందు చేసిన లాస్ట్ సినిమా ఇది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అమెజింగ్ ఎక్స్పీరియన్స్. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను.
ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు..?
డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత క్యారెక్టర్‌కి పెర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నాది యంగ్ మోడ్రన్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్. వెరీ ఫన్ అండ్ లవింగ్‌గా ఉంటుంది. నా పర్సనల్ లైఫ్‌లో కూడా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక లేయర్ ఉంటుంది. కథలో నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది.
మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. ఇప్పుడు విజయ్ గారితో చేశారు. వారి మధ్య ఎలాంటి పోలికలు కనిపించాయి?
ఈ ఇద్దరితో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇద్దరూ చాలా క్రమశిక్షణ గల హీరోలు. సెట్స్‌లో అందరినీ సమానంగా గౌరవిస్తారు. వారితో వర్క్ చేయడం లైఫ్ టైం ఆపర్చ్యూనిటీ.
గోట్లో స్నేహ, లైలా లాంటి సినియర్స్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
స్నేహ, లైలా లాంటి సినియర్స్తో వర్క్ చేయడం గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా ఉంది. అందరూ నన్ను చాలా కేర్‌గా చూసుకున్నారు.
డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి గురించి?
వెంకట్ ప్రభు గారు కూల్ పర్సన్. చిల్‌గా ఉంటారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ యూనిక్‌గా ఉంటుంది. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ న్యూ ఎక్స్పీరియన్స్.
మీ సినిమాల ఎంపిక ఎలా ఉంటుంది..?
స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి చూస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడతాను. ‘మట్’కా పిరియాడిక్ ఫిలిం. అందులో నాది వెరీ డిఫరెంట్ అవతార్. ‘మొకానిక్ రాకీ’లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ‘లక్కీ భాస్కర్’లో మదర్ రోల్ ప్లే చేశా. అనిల్ రావిపూడి సినిమాలో కాప్ రోల్ చేస్తున్నాను. ఇవన్నీ దేనికవే స్పెషల్‌గా ఉంటాయి.