టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మీనాక్షి చౌదరి ఓ సినిమాలో నటించిందంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఇక ఈ బ్యూటీ ఓ మెగా మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తుందనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘విశ్వంభర’లో టాప్ హీరోయిన్ త్రిషతో పాటు యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ కూడా హీరోయిన్గా నటిస్తుందని తెలిసిందే. అయితే, వీరితో పాటు మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటిస్తుందని, ఆమె ఈ సినిమాలో ఓ అద్భుతమైన పాత్రలో కనిపిస్తుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కాగా, ఈ వార్తలపై ఆమె తాజాగా స్పందించింది.
తాను విశ్వంభర చిత్రంలో నటించడం లేదని.. తనకు తెలియకుండానే ఈ వార్తలు ఎందుకు చక్కర్లు కొడుతున్నాయో అర్థం కావడం లేదని.. ఏదైనా సినిమాలో తాను నటిస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని మీనాక్షి చౌదరి కుండ బద్దలు కొట్టింది.