మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. మరి మంచి బజ్ ని సంతరించుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అందిస్తున్న ఒకో అప్డేట్ కూడా మంచి ట్రీట్ ని అందిస్తున్నాయి.
అలా ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ గోదారి గట్టు సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక ఈ సాంగ్ తర్వాత మీను అంటూ వెంకీ మామ అలాగే మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ లపై ఇచ్చిన సాంగ్ ప్రోమో కూడా మంచి చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందని అనిపించింది. ఇపుడు ఎట్టకేలకి మేకర్స్ ఈ ఫుల్ లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ కి వచ్చేసింది. మరి ఈ సాంగ్ కూడా ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లా ఉందని చెప్పాలి.
భీమ్స్ ఇచ్చిన ఈ ట్యూన్ మంచి మెలోడియస్ గా మాజికల్ మూమెంట్స్ తో సూతింగ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఇందులో సాహిత్యం కూడా ఇంపుగా ఉంది. మరి వీటితో అయితే మీను సాంగ్ కూడా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాబోతుంది.
లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి