మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ డిజిటల్ రైట్స్ పై క్రేజీ అప్ డేట్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజా సంచలనం ఏమిటంటే, ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ₹50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. ఇది భారీ మొత్తమే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

కాగా ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. ఇక రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో రవితేజ, చిరంజీవిలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version