మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, తొలిసారిగా చిరుత మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మగధీర మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న చరణ్, అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాలతో, అశేష ప్రేక్షకాభిమానుల ప్రేమతో కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చరణ్ చేసిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ అత్యద్భుత విజయం అందుకుంది.
ఇక ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శంకర్ తో ఒక మూవీ చేస్తున్నారు చరణ్. ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యామిలీ విషయాలు అందరితో పంచుకంటూ ఉంటారు చరణ్. నేడు తన సతీమణి ఉపాసన కొణిదెల బర్త్ డే సందర్భంగా ఆమెకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, తండ్రి మెగాస్టార్ చిరంజీవి తల్లి సురేఖ, భార్య ఉపాసన లతో కలిసి దిగిన మెమొరబుల్ పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కొద్దిసేపటి క్రితం షేర్ చేసారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీ పిక్ ని చూసిన పలువురు మెగాభిమానులు ఎంతో ఆనందంతో దానిని సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేస్తున్నారు.