కొన్ని రోజుల క్రితం వరకు పవన్, అల్లు అర్జున్ అభిమానులకు అస్సలు పడేది కాదు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయి విమర్శలకు దిగిన సందర్భాలు కూడ కోకొల్లలు. ఒకానొక దశలో ఈ రణం ఆయా హీరోల సినిమా ఫలితాల్ని సైతం ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇద్దరు హీరోల అభిమానులు కలివిడిగా ఉంటున్నారు.
ఇటీవల జరిగిన ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ రావడం, పవన్ కు ఎన్నికల్లో తాను సపోర్ట్ చేస్తానని బన్నీ అనడంతో ఇరు హీరోల అభిమానులు అపార్థాలకు తెరదించారు. ఇక తాజాగా బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పవన్ ప్రజా పోరాటానికి సంబందించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ‘మీ నిజమైన తత్వంతో మీరు బ్రతకండి.. ప్రపంచం దానికదే అడ్జెస్ట్ అవుతుంది’ అంటూ ట్వీట్ చేస్తూ మరోసారి పవన్ కు తన సపోర్ట్ ను వెలిబుచ్చారు. బన్నీ చేసిన ఈ చర్యకు మెగా అభిమానులు బాగా ఇంప్రెస్ అయ్యారు.