Vishwambhara: “విశ్వంభర” రూమర్స్ పై క్లారిటీ కోరుకుంటున్న ఫ్యాన్స్

Vishwambhara: “విశ్వంభర” రూమర్స్ పై క్లారిటీ కోరుకుంటున్న ఫ్యాన్స్

Published on Sep 29, 2024 6:02 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ ముఖ్య పాత్రలో చేస్తున్న భారీ చిత్రం “విశ్వంభర”. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ విజువల్ వండర్ కోసం అభిమానులు ఎన్నో అంచనాలు నెలకొల్పుకోగా ఇప్పుడు ఈ చిత్రం పై పలు షాకింగ్ రూమర్స్ అయితే వైరల్ గా మారాయి. ఈ చిత్రాన్ని మేకర్స్ నిజానికి జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు విశ్వంభర ఈ డేట్ లో రావడం లేదు అనే రూమర్ ఊపందుకుంది. దీనితో ఇప్పుడు మెగా అభిమానులు ఈ అవైటెడ్ సినిమాపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇచ్చి ఈ రూమర్స్ మేఘాలని తొలగిస్తారో లేదో అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే దసరా కానుకగా సినిమా టీజర్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ ఉంది. మరి చూడాలి ఈ సినిమా ఎపుడు విడుదల చేస్తారు అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు