నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీకి మెగా హీరో బెస్ట్ విషెస్ …. !

Published on Aug 11, 2022 10:00 pm IST

నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం రేపు భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీకి మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించగా కృతి శెట్టి,క్యాథరీన్ త్రెసా హీరోయిన్స్ నటించారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్ అన్ని కూడా మూవీపై అంచనాలు పెంచాయి. తొలిసారిగా ఈ మూవీ ద్వారా ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతన్నారు.

నితిన్ ఇందులో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనుండగా దీనిని మాస్ యాక్షన్ తో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కించారట. ఇక రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుతూ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బెస్ట్ విషెస్ తెలియ చేసారు. హీరో నితిన్ తోపాటు మాచర్ల నియోజకవర్గం టీమ్ మొత్తానికి తన తరపున బెస్ట్ విషెస్ అంటూ వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :