వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న మెగా హీరో సినిమా!


తొలి చిత్రం ఉప్పెనతో గ్రాండ్ హిట్ కొట్టిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రీసెంట్ గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయిక గా నటించింది. ఈ చిత్రానికి థియేటర్లలో మరియు ఓటిటి లో మిశ్రమ స్పందన వచ్చింది.

ఇప్పుడు, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 18, 2022న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కి సిద్ధం గా ఉంది. నరేష్, ప్రభు, నవీన్ చంద్ర, సుబ్బరాజు, తులసి, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను తన హోమ్ బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించడం జరిగింది. ఈ మెగా మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Exit mobile version