మన టాలీవుడ్ కి చెందిన మెగా హీరోలు బిగ్ స్క్రీన్ పై అభిమానులని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటే అటు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎలాంటి సాయం చేయడానికి కూడా వెనుకాడరు. మరి ఇది దాదాపు మెగా కుటుంబం నుంచి ఉన్న అందరు హీరోలు కూడా ఎన్నో గుప్త దానాలు కూడా చేస్తూ వస్తున్నారు. మరి తాజాగా మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. గత కొన్ని రోజులు కితం కేరళలో హృదయ విదారక ఘటన జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వాయనాడ్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రకృతి విపత్తు ఎన్ని వేల ప్రాణాలు బలిగొంది.
దీనితో సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నటులు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ వస్తుండగా మన టాలీవుడ్ స్టార్స్ కూడా తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. మరి మెగా కుటుంబం నుంచి తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలాగే రామ్ చరణ్ (Ram Charan) లు కలిసి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించగా మరో మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన వంతుగా 25 లక్షల రూపాయలు అందిస్తున్నటుగా తెలిపాడు. దీనితో మరోసారి మెగా హీరోలు సమాజం పట్ల తమ ఉదారతను ప్రదర్శించారు అని చెప్పాలి.
Deeply distressed by the devastation and loss of hundreds of precious lives in Kerala due to nature’s fury in the last few days.
My heart goes out to the victims of the Wayanad tragedy. Charan and I together are contributing Rs 1 Crore to the Kerala CM Relief Fund as a token of…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2024
I am deeply saddened by the recent landslide in Wayanad. Kerala has always given me so much love, and I want to do my bit by donating ₹25 lakh to the Kerala CM Relief Fund to support the rehabilitation work. Praying for your safety and strength . @CMOKerala
— Allu Arjun (@alluarjun) August 4, 2024