మై హోమ్ వారి.. “మై హోమ్ అక్రిదా” ప్రారంభం

మై హోమ్ వారి.. “మై హోమ్ అక్రిదా” ప్రారంభం

Published on Aug 11, 2024 9:35 AM IST

Myhome

మై హోమ్ గ్రూప్ వారి మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ “మై హోమ్ అక్రిదా”ను నేడు అట్టహాసంగా ప్రారంభించారు. హైదరాబాద్‌ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి దగ్గరలో గోపన్ పల్లి నుంచి తెల్లాపూర్‌ రోడ్డు మార్గంలోని ఫ్రైమ్ ఏరియాలో ఈ మై హోమ్ అక్రిదా టవర్స్ రాబోతున్నాయి.

మై హోమ్ గ్రూప్, ప్రతిమ గ్రూప్‌ల జాయింట్ వెంచర్‌గా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 24.99 ఎకరాల్లో G+39 అంతస్తులతో.. 81 శాతం ఓపెన్ ప్లేస్‌తో 12 టవర్లలో 3780 ఫ్లాట్‌లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఫేజ్-1లో 6 టవర్లలో బుకింగ్స్ ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో 1399 sft నుంచి 2347sft వరకు 2BHK, 2.5BHKతో పాటు 3BHK ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్‌లు నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తుకు 8 ఫ్లాట్‌లతో కూడిన మొత్తం 12 టవర్లను నిర్మిస్తున్నారు.

నివాసితులకు అన్నిరకాల సౌలభ్యాలను అందిస్తున్న ఈ ప్రాజెక్ట్, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్‌లో వస్తుండటం మరో హైలైట్. హైదరాబాద్‌లో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ORR, ఎయిర్‌పోర్ట్, హై-ఎండ్ రెస్టారెంట్లు, మాల్స్, స్కూళ్లు.. మరెన్నో సులువుగా చేరుకునే విధంగా.. విశాలమైన రోడ్ల కనెక్టివిటీ కూడా ఉంది.

ప్రాజెక్ట్ హైలైట్స్..
7.5 ఎకరాల సెంట్రల్ ల్యాండ్‌స్కేప్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం
ప్రతి టవర్‌లో డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ
1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 క్లబ్‌హౌస్‌లు
టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు