మెగాస్టార్ 156 : గ్రాండ్ రెగ్యులర్ షూట్ స్టార్ట్

మెగాస్టార్ 156 : గ్రాండ్ రెగ్యులర్ షూట్ స్టార్ట్

Published on Nov 23, 2023 3:07 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఇటీవల గ్రాండ్ లెవెల్లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. ఈ గ్రాండ్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనుండగా అతి త్వరలో సినిమాలోని హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటుల్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని అప్ డేట్స్ కోసం తరచు మా వెబ్ సైట్ చూస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు