మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భ్రమయుగం” కోసం ఇప్పుడు అందరికీ తెలిసిందే. మరి అనౌన్సమెంట్ తోనే మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం తర్వాత టీజర్ ట్రైలర్ లతో కూడా మళయాళ సినిమా నుంచి మరో సరికొత్త ఎక్స్ పీరియన్స్ వస్తుంది అని అంతా భావించారు. ఇక దర్శకుడు రాహుల్ సదా శివన్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గానే తెలుగులో కూడా విడుదల అయ్యింది.
అయితే మోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాలిడ్ నంబర్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. దీనితో ఈ చిత్రం రానున్న రోజుల్లో మరింత బెటర్ వసూళ్లు అందుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించగా నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి వారు వై నాట్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.
#Bramayugam crosses 50 Crores in Global Box Office Collections ! ????#Bramayugam starring @mammukka
Written & Directed by @rahul_madking
Produced by @chakdyn @sash041075@allnightshifts @studiosynot@Truthglobalofcl @AanMegaMedia @APIfilms @SitharaEnts@SureshChandraa… pic.twitter.com/vCcsRui2G9
— Night Shift Studios LLP (@allnightshifts) February 25, 2024