మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తుండగా, పూర్తి సోషియో ఫాంటసీ మూవీ గా ఇది రానుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా, మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్టు కోసం అప్పుడే కసరత్తులు ప్రారంభమైనట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని ఈ డైరెక్టర్ తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మెగా 157 సినిమాకు ప్రముఖ రైటర్ బివిఎస్ రవి కథను అందించనున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో ఈ ప్రాజెక్టుపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. మరి నిజంగానే మెగాస్టార్ నెక్ట్స్ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారా అనే విషయంపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.