బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Sep 2, 2024 12:02 AM IST


టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అంటే ఒక రకమైన ఎనర్జీ అభిమానుల్లో వచ్చేస్తుంది. ఇలా ఈ ఏజ్ లో కూడా బాలయ్య యువకుడిలా సాలిడ్ ఎనర్జీతో అభిమానులని అలరిస్తూనే ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసేసుకున్నారు. దీనితో అరుదైన మైలురాయిని అందుకున్న బాలయ్య కోసం అభిమానులు గ్రాండ్ గా స్వర్ణోత్సవ వేడుకలు జరుపగా అందుకు మెగాస్టార్ చిరంజీవి సహా ఎందరో స్టార్స్ వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తాను మాట్లాడుతూ..

“బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం మాకు చాల ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుకలా చూస్తున్నాను. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాల కృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా అందరూ. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేము అంత ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలో అని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య” అంటూ మెగాస్టార్ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు